Site icon NTV Telugu

JIO: అంత‌ర్జాతీయ మార్కెట్లో ప‌ట్టుకోసం ముఖేష్ అంబానీ ప్ర‌య‌త్నం…

దేశీయ టెలికాం దిగ్గ‌జం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌ట్టుసాధించేందుకు అవ‌కాశం దొరికింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌పై ఎలాగైనా ప‌ట్టుసాధించాల‌ని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్‌, బ్రెజిల్, మెక్సికో, ర‌ష్యా వంటి దేశాల్లో గ్లాన్స్‌ను వేగంగా లాంచ్ చేసేందుకు అవ‌కాశం ఉన్న‌ట్టు నివేదిక‌లు చెబుతున్నాయి.

Read: Hindustan Ki Antim Dukan : ఇండియాలో ఇదే చివ‌రి దుకాణం… ఆనంద్ మ‌హీంద్రా సైతం…

గ్లాన్స్ లో జియో పెట్టిన 200 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌ను లాక్ స్క్రీన్‌పై ప్లైవ్ కంటెంట్‌, కామ‌ర్స్‌, ఎకోసిస్ట‌మ్‌ను రూపొందించేందుకు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సేవ‌ల్ని విస్త‌రింప‌జేసేందుకు వినియోగించ‌బోతున్నారు. గ‌త రెండేళ్ల‌లో గ్లాన్స్ వేగంగా వృద్ది చెందుతోంద‌ని, ఇంట‌ర్నెట్‌, లైవ్ కంటెంట్ తో పాటు అనేక రంగాలను లాక్ స్క్రీన్‌లో ఇంట‌ర్నెట్‌ను వినియోగించుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప్ర‌త్యేక అనుభూతి క‌లుగుతుంద‌ని జియో డైరెక్ట‌ర్ ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.

Exit mobile version