జియో గుడ్‌న్యూస్.. ఇక బ్రౌజింగ్ ఆగదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో… ‘ఎమర్జెన్సీ డేటా లోన్’ సదుపాయాన్ని ప్రారంభించింది.. డేటా పూర్తిగా అయిపోయి బ్రౌజింగ్‌కు ఇబ్బందులు తలెత్తితే.. ఆ వెంటనే ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది జియో.. ఈ డేటాను తొలుత వాడుకుని తర్వాత చెల్లించేలా ఐదు డేటా లోన్ ప్లాన్లను తీసుకొచ్చింది జియో.. ఒక్కో ప్యాక్‌తో ఒక జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఈ విధానంలో తొలుత డేటాను ఉపయోగించుకుని దానికయ్యే మొత్తాన్ని ఆ తర్వాత చెల్లించొచ్చు. ప్రస్తుత డేటా ప్యాక్ అయిపోయిన తర్వాత మరో డేటా టాప్‌ను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ డేటా లోన్ ఎంతగానో యూజర్లకు ఉపయోగపడనుంది..
ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్‌తో ఒక జీబీ డేటా అందిస్తారు.. ఈ ప్యాక్ విలువ 11 రూపాయలు. ఇక, డేటా కాలపరిమితి బేస్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 1 జిబి చొప్పున 5 అత్యవసర డేటా లోన్ ప్యాక్‌లను తీసుకొచ్చింది.. ఈ అత్యవసర డేటా లోన్‌ను మైజియో యాప్ ద్వారా పొందే సదుపాయం ఉంది. చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ డేటా కోటాను చాలా వేగంగా వినియోగించుకుంటున్నారు.. మిగతా రోజులలో హై స్పీడ్ డేటా లేకుండా ఇబ్బంది పడుతున్నారు.. ఇది గమనించిన జియో.. హై స్పీడ్ డేటాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకొచ్చింది. అత్యవసర డేటా లోన్ సౌకర్యం.. వినియోగదారులకు సరళమైన మరియు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని, బ్రేక్ లేకుండా హై స్పీడ్ డేటా అనుభవాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని చెబుతోంది జియో.
Also Read
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
తాజావార్తలు
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!