NTV Telugu Site icon

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌.. ఆ రోజు సెంటిమెంట్…!

Jeff Bezos

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్ర‌పంచంలోనే అప‌ర‌కుభేరుడు జెఫ్ బెజోస్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు… అమెజాన్‌ సీఈవో పదవికి ఆయ‌న గుడ్‌బై చెప్ప‌నున్నారు.. జులై 5న తేదీన సీఈవో బాధ్యతల నుంచి అధికారికంగా వైదొల‌గేందుకు సిద్ధ‌మ‌య్యారు.. ఇక‌, ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు.. ఇవాళ జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు బెజోస్ .. కాగా, ఫిబ్రవరిలోనే బెజోస్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది. కానీ, నిర్దిష్ట తేదీని వెల్లడించలేదు. జెఫ్ స్థానంలో ఉన్న జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్-కంప్యూటింగ్ బిజినెస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవి నుంచి తప్పుకున్న అనంతరం బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొన‌సాగ‌నున్నారు.

ఇంటర్నెట్‌తో పుస్తకాలను అమ్మడం ద్వారా అమెజాన్‌ సంస్థను జెఫ్ బెజోస్ ప్రారంభించారు. జూలై 5 బెజోస్‌కు చాలా సెంటిమెంట్. అందుకే అదే రోజున సీఈవో పదవి బాధ్యతల నుంచి తప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.. అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఈ ప్రకటన చేశారు జెఫ్ డెజోస్.. ఇక‌, బెజోస్ వ్యక్తిగత సంపాదన 167 బిలియన్ డాలర్లు. సీఈవో.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కొత్త ఉత్పత్తులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నార‌ని చెబుతున్నారు.. అయితే, సరిగ్గా 27 ఏళ్ల క్రితం అదే రోజున అమెజాన్ సంస్థ ప్రారంభమైంది.. అందుకే జులై 5వ తేదీన నాకు చాలా ప్రత్యేకమైనద ఆయ‌న తెలిపారు.