NTV Telugu Site icon

Infosys: నెలకు 10 రోజులు ఆఫీసుకు రండి.. ఉద్యోగుల్ని కోరిన ఇన్ఫోసిస్..

Infosys

Infosys

Infosys: కరోనా మహమ్మారి ముగిసిపోవడంతో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి పలు ఐటీ సంస్థలు. ఇదిలా ఉంటే కొన్ని సంస్థలు వారానికి మూడు రోజులైన ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. హైబ్రీడ్ విధానంలో పనిచేయాలని సూచిస్తున్నాయి.

Read Also: UNESCO: కోజికోడ్, గ్వాలియర్ నగరాలకు యునెస్కో గుర్తింపు.. క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు..

ఈ నేపథ్యంలో భారతదేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుగా ఉన్న ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన ఉద్యోగుల్లో కొంతమందిని నెలకు 10 రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరినట్లు సమాచారం. హైయ్యర్ ఎఫీషియెన్సీ, ఉద్యోగుల మెరుగైన సహకారం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ‘రిమోట్ వర్క్’ విధానాన్ని తీసేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ నవంబర్ 20 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ఎంట్రీ, మిడ్ లెవల్ సిబ్బందికి ఈమెయిల్స్ పంపినట్లు తెలిసింది.

ఇటీవల ఇన్ఫోసిస్ సీఈవో సాహిల్ పరేఖ్ మాట్లాడుతూ..మేము మా ఉద్యోగులను ఫ్లెక్సిబుల్ గా ఉండాలని అనుకుంటున్నామని, ప్రతీ త్రైమాసికంలో, ప్రతీ వారంలో క్యాంపస్ లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉండాలని అనుకుంటున్నాము, ఇది కొనసాగుతుంది అని ఆయన అన్నారు. గత వారం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం వారానికి 70 గంటలు భారత యువకులు పనిచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇదిల ఉంటే ఇప్పటికే టీసీఎస్ ఇప్పటికే తన ఉద్యోగుల్ని వారానికి 5 రోజలు ఆఫీసుకు రావడాలని కోరింది. టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఆల్ఫాబెట్, గూగుల్ ప్రతీ వారం కూడా కనీసం కొన్ని రోజులైన ఆఫీసుల్లో పనిచేయాలని కోరింది.