గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలపై ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 16 వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియాలో విక్రయించే నిర్దిష్ట స్మార్ట్‌ఫోన్‌ల్లో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేయబడిన భాగాలను కలిగి ఉండాలనే నిబంధనలను గూగుల్ పాటించనందున ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధంపై గూగుల్ స్పందిస్తూ.. ఇండోనేషియాలో పిక్సెల్ ఫోన్‌లు అధికారికంగా పంపిణీ చేయబడలేదని గూగుల్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: IND vs NZ: చిరుతలా పరిగిత్తే కోహ్లీ జోరుకు బ్రేక్ పడిందా..? రనౌట్ వీడియో
స్థానిక కంటెంట్‌కు సంబంధించిన ధృవీకరణ పొందేవరకు గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించదు. ఇండోనేషియాలోని పెట్టుబడిదారులందరికీ అవకాశం అందించేందుకు, ప్రాంతీయ పారిశ్రామిక విలువను పెంచడానికి ఈ కొత్త నియమాలను తీసుకొచ్చింది. “ఇండోనేషియాలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులందరి కోసం స్థానిక కంటెంట్ సంబంధిత విధానాలు రూపొందించినట్టు పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫెబ్రి హెండ్రీ ఆంటోని అరీఫ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Terrorist Attack In Budgam: ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు యువకులు మృతి