Site icon NTV Telugu

ఇండియాలో తొలి క్రూయిజ్ ఎల‌క్ట్రిక్ బైక్… ఒక‌సారి రీఛార్జ్ చేస్తే…

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరిగింది. ఇప్ప‌టికే మోపెడ్, స్కూట‌ర్లు అందుబాటులోకి రాగా, తాజాగా క్రూయిజ్ బైక్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఢిల్లీకి చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల స్టార్ట‌ప్ సంస్థ కొమాకీ దేశ‌వ్యాప్తంగా స్మార్ట్ స్కూట‌ర్లు, హై స్పీడ్ స్కూట‌ర్లు, ఈజీ రిక్షా పేరుతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విక్రయిస్తోంది. కాగా, కొమాకీ కంపెనీ ఇప్పుడు తొలి క్రూయిజ్ ఎల‌క్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ది. ఈ బైక్‌ను జ‌న‌వ‌రి 26 న లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ బైక్ ను ఒక‌సారి రీఛార్జ్ చేస్తే 220 కిమీ ప్ర‌యాణం చేస్తుంద‌ని కంపెనీ వ‌ర్గాలు తెలిపారు. కొమాకీ క్రూయిజ‌ర్ ఎల‌క్ట్రిక్ బైక్ ధ‌ర సాధార‌ణ క్రూయిజ్ బైక్‌ల కంటే త‌క్కువ‌గా ఉంటుంద‌ని కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దీని ధ‌ర రూ. 1.68 ల‌క్ష‌లు ఉంటుంద‌ని కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Read: ఇండియాలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు…

Exit mobile version