దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపించాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల మళ్లింపు, పెరిగిన ముడి చమురు ధరలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో గురువారం మార్కెట్ అమాంతంగా పతనమైంది. పెట్టుబడిదారులకు బ్లడ్‌బాత్ ఎదురైంది. ప్రారంభం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న సూచీలు.. మధ్యాహ్నం తర్వాత తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. చివరికి సెన్సెక్స్ 1, 045 పాయింట్లు నష్టపోయి 71,593 దగ్గర ముగియగా.. నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోయి 22, 231 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్‌లో ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఇండిగో, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద నష్టాల్లో నిలిచాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ 2 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా నిఫ్టీలోని అన్ని ప్రధాన రంగాల సూచీలు క్షీణించాయి.

