Stock Market Crash: సోమవారం నుంచి శుక్రవారం వరకు వారం మొత్తం భారత స్టాక్ మార్కెట్‌కు కష్టకాలం గడిచింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 2,200 పాయింట్లు పడిపోయింది. వారం చివరి ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 604 పాయింట్లు పడిపోయి 83,576కి చేరుకోగా, నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 435 పాయింట్లు పడిపోయింది. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 2,186 పాయింట్లు పడిపోయింది, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 2.5 శాతం క్షీణించింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో వచ్చిన భారీ క్షీణత బిఎస్‌ఇ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లకు పైగా తగ్గడానికి దారితీసింది.
READ ALSO: Home Tips: మీ ఇంట్లో బొద్దింకల బెడదా..? ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ ఇవి కనిపించవు..!
సాక్ట్ మార్కెట్‌లో వచ్చిన ఈ భారీ క్షీణత BSE మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీల నష్టాలకు దారితీసింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై US వాణిజ్య చర్యలపై పెరిగిన ఉద్రిక్తతల కారణంగా ఈ అమ్మకాలు ప్రధానంగా జరిగాయి. స్టాక్ మార్కెట్ క్షీణతకు దారితీసిన అంశాలను పరిశీలిద్దాం.
భారత స్టాక్ మార్కెట్ పడిపోడానికి కారణాలు..
* అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా చమురు కొనుగోలును చేస్తునక్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500% వరకు సుంకాలను పెంచడానికి దారితీసే బిల్లును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు.
* స్టాక్ మార్కెట్‌లో వరుస ఐదు రోజుల నష్టాల సమయంలో విదేశీ పెట్టుబడిదారులు నిరంతర అమ్మకాలు మార్కెట్ బలహీనతను మరింత తీవ్రతరం చేశాయి. జనవరి 8న విదేశీ పెట్టుబడిదారులు రూ.3,367.12 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించారు.
* ప్రపంచ మార్కెట్లలో బలహీనత భారత ఈక్విటీలలో జాగ్రత్తను మరింత పెంచింది. ఆసియా స్టాక్ మార్కెట్లు కొద్దిగా పడిపోయాయి, భారతదేశం-యుఎస్ ఒప్పందం కూడా నిలిచిపోయింది.
* అమెరికా సుప్రీంకోర్టు నేడు ఇతర దేశాలపై సుంకాలు విధించడం సమర్థనీయమా కాదా అని నిర్ణయించే డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై తన తీర్పును వెలువరించనుంది.
* ముఖ్యంగా ముడి చమురు దిగుమతులపై దేశం ఎక్కువగా ఆధారపడటం దృష్ట్యా, పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత ఈక్విటీలకు మరో సవాలుగా మారాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఒత్తిడి కారణంగా చమురు ధరలు పెరిగాయి. ఇవన్నీ భారత స్టాక్ మార్కెట్‌ను ఈ వారం దెబ్బ కొట్టాయి. రూ.13 లక్షల కోట్లకు పైగా తగ్గడానికి కారణం అయ్యాయి.
READ ALSO: Duddilla Sridhar Babu : నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే.
