Site icon NTV Telugu

Indian Rupee Fall: కరెన్సీ మార్కెట్‌ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం! రీజన్స్ ఇవే..

Indian Rupee Fall

Indian Rupee Fall

Indian Rupee Fall: డాలర్‌తో పోలిస్తే రూపాయి మరోసారి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం రూపాయి ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇదే టైంలో డాలర్ ఆరు వారాలలో అత్యంత బలమైన స్థాయిలో ట్రేడవుతోంది. వరుసగా మూడవ రోజు కూడా రూపాయి క్షీణించిందని, దీని ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలకు పైగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

READ ALSO: Republic Day Sale Deals: అద్భుతమైన ఆఫర్.. రూ.6 వేల లోపే స్మార్ట్ టీవీ.. రిపబ్లిక్ డే సేల్‌లో సూపర్ డీల్స్

రాబోయే రోజుల్లో రూపాయి మరింత తగ్గుదల చూడవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దాదాపు నెల క్రితం చేరుకున్న చారిత్రాత్మక కనిష్ట స్థాయిలను అధిగమించి రూపాయి మరింత పతనమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోతే సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంటున్నారు. నిజానికి ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే రూపాయి విలువ గణనీయంగా తగ్గడానికి దారితీసిన కారణాలు ఏంటి అనేది.

రూపాయి విలువ పతనం కావడానికి అతిపెద్ద కారణం అమెరికా – భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ముగించడంలో వైఫల్యం. డాలర్ డిమాండ్ కారణంగా రూపాయి పడిపోతోంది. ఇదే టైంలో డాలర్ ఇండెక్స్ పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణ ఇంకా ముగియలేదు. దీని ప్రభావం రూపాయిపై స్పష్టంగా కనిపిస్తుంది.

శుక్రవారం వరుసగా మూడో రోజు రూపాయి విలువ క్షీణించి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 44 పైసలు తగ్గి 90.78 వద్ద ముగిసింది. బలమైన డాలర్ డిమాండ్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల మూలధన ప్రవాహాలు రూపాయి పతనంపై మరింత ప్రభావం చూపాయి. అమెరికా-భారతదేశం వాణిజ్య చర్చల గురించి ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయని విదేశీ కరెన్సీ వ్యాపారులు తెలిపారు. ముఖ్యంగా ఈ రూపాయి క్షీణత 2026 తర్వాత ఇదే అతిపెద్దది.

ఇంటర్‌బ్యాంక్ విదేశీ కరెన్సీ మారక మార్కెట్లో డాలర్‌కు రూపాయి విలువ 90.37 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఇది డాలర్‌కు 90.89 కనిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి డాలర్‌తో పోలిస్తే 90.78 వద్ద ముగిసింది. బుధవారం ముగింపు ధర కంటే 44 పైసలు తగ్గింది. బుధవారం అమెరికా డాలర్‌తో రూపాయి విలువ 90.34 వద్ద ముగిసింది. ముంబైలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల కారణంగా గురువారం విదేశీ మారక మార్కెట్లు బంద్ చేశారు. వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి విలువ క్షీణించింది.

రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
రూపాయి క్షీణతకు ప్రధాన కారణం భారతదేశం – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడమే. ఇటీవల ఈ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కోరుతున్నాయని అమెరికా రాయబారి పేర్కొన్నారు. భారతదేశం అమెరికాకు చాలా ముఖ్యమైన దేశం. రెండు దేశాల మధ్య సమావేశాలు కూడా జరిగాయి, కానీ ఇంకా సానుకూల స్పందన రాలేదు.

* ఇటీవలి రోజుల్లో డాలర్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన సుంకాల చర్యలు డాలర్ డిమాండ్ పెరుగుదలకు కారణం అయ్యింది.

* భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణలు కూడా రూపాయి క్షీణతకు ప్రధాన కారణంగా నిలిచాయి. శుక్రవారం విదేశీ పెట్టుబడిదారులు రూ.4,346.13 కోట్ల విలువైన లాభాలను బుక్ చేసుకున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ప్రస్తుత సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి రూ.22,530 కోట్లను ఉపసంహరించుకున్నారు.

* ఈ నెలలో సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే దాదాపు 2% తగ్గాయి. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది.

READ ALSO: Mukesh Ambani: అంబానీ దెబ్బకు ప్రత్యర్థులు అవుట్! ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేందుకు రిలయన్స్ బాస్ ప్లాన్..

Exit mobile version