టెస్లా కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టాలని చాలా కాలంగా చూస్తున్నది. అయితే, టెస్లా కార్లలో వినియోగించే పార్ట్స్ లో 10 నుంచి 15 శాతం మేర ఇండియాలో తయారైన వాటిని వినియోగించాలని, అప్పుడే రాయితీలు ఇస్తామని గతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో ప్లాంట్ పెట్టే విషయంలో రాయితీలు ఇవ్వాలంటే గైడ్‌లైన్స్ పాటించాల్సిందేనని భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో టెస్లా కంపెనీ కార్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. తాజాగా టెస్లాకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Read: Somireddy: అనాలోచితం.. మళ్లీ జిల్లాలను మారుస్తారా..?
టెస్లా కార్లలో భారత్‌లో తయారైన పరికరాలను ను 500 మిలియన్ డాలర్ల మేర వినియోగించాలని షరతు విధించింది. మరి ఈ షరతులకు ఎలన్ మస్క్ కంపెనీ ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. పూర్తిగా విదేశాల్లో తయారైన టెస్లా కార్లను ఇండియాలో దిగుమతి చేసుకుంటే దానికి 100 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రూ. 30 లక్షల విలువ చేసే కారు… పన్నులతో కలిపి రూ. 60 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అందుకే టెస్లా కార్ల షోరూమ్‌ను ఇండియాలో ఏర్పాటు చేయలేకపోయినట్లు గతంలో ఎలన్ మస్క్ పేర్కొన్నారు.