2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol, LPG and Milk Prices: గడచిన రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో నిత్యావసరాల ధరల పెరుగుదల ఓ ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కాలంలో ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ.. దానికి సమాంతరంగా ఇంధనం, వంటగ్యాస్, పాలు వంటి రోజువారీ అవసరాల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 2000 వ సంవత్సరం నాటి ధరలను ప్రస్తుత 2026 నాటి ధరలతో పోల్చుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గ్రాఫిక్ నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ గ్రాఫిక్‌లోని వివరాలు దాదాపు నిజమే అయినప్పటికీ, వివిధ నగరాలు, బ్రాండ్లు, రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి దీనిని కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే చూడాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ గ్రాఫిక్ ప్రకారం ధరల వ్యత్యాసాలను గమనిస్తే.. 2000వ సంవత్సరంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 26 రూపాయలుగా ఉండేది. కానీ ఇప్పుడు 2026 నాటికి పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 102 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో అయితే ఏకంగా రూ.105 దాటేసింది. అంటే గతంతో పోలిస్తే పెట్రోల్ ధర దాదాపు 4 రెట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ప్రభుత్వ పన్నులు, రవాణా ఖర్చులు ఎక్కువవ్వడం వంటి కారణాల వల్లే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరిగాయి. ఇక ప్రతి ఇల్లాలు లెక్కలు వేసుకునే వంటగ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ సగటు ధర సుమారు 157 రూపాయలు మాత్రమే. కానీ నేడు 2026లో దాని ధర దాదాపు 912 రూపాయలకు పైగా ఉంది. అంటే వంటగ్యాస్ ధర ఏకంగా 6 రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ, రకరకాల విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ.. ఇప్పటికీ సగటు కుటుంబ బడ్జెట్లో ఎల్పీజీ సిలిండర్ అనేది ఓ పెద్ద ఖర్చుగా మిగిలిపోయింది.
Also Read
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
- JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
మరోవైపు దేశంలోని ప్రతి ఇంట్లోనూ నిత్యావసరమైన పాల ధరలు సైతం ఆహార ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నగరాలు, బ్రాండ్లు, పాలలో ఉండే ఫ్యాట్ కంటెంట్‌ను బట్టి ధరలు మారినప్పటికీ.. గత రెండు దశాబ్దాలుగా పాల సగటు ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంలో లీటర్ పాలు కేవలం 14 రూపాయలకే లభించగా, ఇప్పుడు 2026 నాటికి వాటి ధర 72 రూపాయలకు చేరింది. అంటే పాల ధర 5 రెట్లకు పైగా పెరిగింది. పశుగ్రాసం ధరలు పెరగడం, రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు ఎక్కువవ్వడమే ఇందుకు ప్రధాన కారణాలు. అయితే, కేవలం ఈ మూడు వస్తువుల ధరల పెరుగుదలను బట్టే దేశంలో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పూర్తిగా పెరిగిపోయిందని అంచనా వేయలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మనుషుల జీవనశైలి అనేది కేవలం ఇంధనం, పాలతోనే ముడిపడి ఉండదు. ఇల్లు, వైద్యం, విద్య, రవాణా సౌకర్యాలు, కరెంట్-నీటి బిల్లులు, వినోదం వంటి అనేక అంశాలు ఇందులో భాగమవుతాయి. పైగా మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఈ ధరల్లో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఈ పోలిక కేవలం నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఒక ఉదాహరణ మాత్రమే.. కానీ, దేశ సంపూర్ణ జీవన వ్యయానికి కొలమానం కాదు.
తాజావార్తలు
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!