కరోనా ఎఫెక్ట్.. అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కల్లోలం ప్రారంభమైనప్పట్టి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ నిషేధం విధించింది.. భారత్ నిర్ణయం తీసుకుని దాదాపు 11 నెలలు అవుతుంది.. కరోనా ఫస్ట్ వేవ్ పోయి.. సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలోనూ నిషేధం పొడిఇస్తూ వచ్చిన కేంద్రం.. తాజాగా, మరో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది.. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది డీజీసీఏ.. అయితే, ఈ సమయంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చే ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించబోవు..
అయితే, అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినా.. ప్యాసింజర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పలు దేశాలతో భారత్.. ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.. దీని ప్రకారం.. అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతున్నది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ , ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కెనడా, ఇథియోపియా, జర్మనీ, ఇరాక్, జపాన్, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రువాండా, సీషెల్స్, టాంజానియా, ఉక్రెయిన్ సహా 28 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.. మహమ్మారి మధ్య భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య ముందస్తు షరతులతో విమానాలను తిరిగి ప్రారంభించే విధానమే ఈ ఎయిర్ బబుల్ ఒప్పందం ఉద్దేశం. ఇది ఎలా ఉన్నా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. మరో 30 రోజులు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగించింది కేంద్రం.
Also Read
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
- SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!