NTV Telugu Site icon

IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు

I T Returns Filed

I T Returns Filed

I-T Returns Filed: భారతదేశంలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత ఈ సంఖ్య మరింత పెరుగతోందని ఐటీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపు దారుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నట్టు ఐటీ శాఖ లెక్కలో బయటపడుతోంది. లక్షాధికారుల సంఖ్య కంటే కూడా కోటీశ్వరుల సంఖ్యనే వాటిలో ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాగే పన్ను చెల్లింపుదారుల సంఖ్య కరోనా తరువాత బాగా పెరిగినట్టు ఐటీ శాఖ రిటర్న్స్ లో బయటపడింది. కరోనా తరువాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతోపాటు.. ఐటీ రిటర్న్స్ రూపంలో వస్తున్న ఆదాయం కూడా పెరిగింది.

Read also: Rajya Sabha: డెరెక్‌ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌పై రాజ్యసభలో హైడ్రామా.. చివరకు..

ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశారు. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ 2018-19 తో పోల్చితే ఆర్థిక 49.4 శాతం పెరిగింది. ఇది కాస్త 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. అయితే రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌ ఈ మధ్య కాలంలో 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్‌ రిటర్న్స్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షల మంది ఉంటే.. 2021-22 ఏడాదికి 1.93 లక్షల మంది కాగా.. అదే 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.80 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఐటీ రిటర్న్స్ లో రూ. 5 లక్షలు లోపు ఆదాయ ఉన్న వారిలో పన్ను చెల్లింపు దారుల్లో 0.6 శాతం మాత్రమే పెరిగినట్టు ఐటీ శాఖ ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 4.94 కోట్ల మంది గత ఏడాది పన్ను చెల్లింపు చేయగా.. అదికాస్త ఈ ఏడాది 5.68 కోట్ల మందికి పెరిగింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు గత ఏడాది 1.90 లక్షల ఉండగా.. ఈ ఏడాది 1.46 లక్షల మందికి పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయం వచ్చే వారు.. అలాగే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు దాఖలు చేసే ట్యాక్స్‌ రిటర్న్స్‌ తగ్గుతున్నాయి.