Business Ideas: మీకు ఎకరం పొలం ఉందా.. మీరు లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి 10 లక్షలు వరకు ఆదాయం వచ్చే పంట ఒకటుందని అంటున్నారు నిపుణులు. ఆదాయం సంగతి పక్కన పెడితే.. అసలు ఈరోజుల్లో వ్యవసాయం ఎవరు చేస్తున్నారు.? దాదాపు ఏసీలో కూర్చొని పనిచేయడమే అందరు ఇష్టపడతారు. ఎండలో ఎవరూ పనిచేస్తున్నారు. ఎక్కడో నూటికో ఒక్కరో ఇద్దరో తప్ప. అలా అని వ్యవసాయం చేయకపోవడం పప్పులో కాలేసినట్టే.. నిజానికి వ్యవసాయం సరిగ్గా నిర్వహణ చేసుకుంటే అదే ఒక పండగ అని అంటున్నారు నిపుణులు.
Read Also: Mamata Banerjee: రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంః మమత బెనర్జీ
సరే వ్యవసాయం చేసుకుందామనే వారి విషయానికొస్తే.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువచ్చే పంటలు కొన్ని ఉన్నాయి. అందులో సులభంగా పండించుకునే పంటలో గోరు చిక్కుడు ఒకటి. గోరు చిక్కుడుతో అన్నీ లాభాలుంటాయా అంటే అవుననే అంటున్నారు. పంట విషయానికి వస్తే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సైతం గోరుచిక్కుడు ఏపుగా ఎదుగుతుంది. దీనికి ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ. గోరుచిక్కుడు మనం కూర మాత్రమే వండుకొని తింటాం కానీ.. దానిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. గోరుచిక్కుడులో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. దానిలోని ఫైబర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.
Read Also: Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది
గోరుచిక్కుడు పంట ఒక వాణిజ్య పంట. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మనం ఇంతకాలం గోరుచిక్కుడుకాయను కేవలం ఒక కూరగాయగా మాత్రమే భావించాం. కానీ గోరుచిక్కుడుకాయ గింజలకు చాలా డిమాండ్ ఉంటుంది. అదే కాకుండా గోరుచిక్కుడు గింజల నుంచి తీసిన జిగురుకు చాలా డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా కూడా గోరుచిక్కుడు గింజల జిగురుకు అత్యంత విలువ ఉంది. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న అనేక విలువైన వస్తువుల్లో గోరుచిక్కుడు జిగురు కూడా ఒకటి. ఆ జిగురును పారిశ్రామికంగా అనేక ఉత్పత్తుల్లో వాడుతారు. ఫుడ్ ఇండస్ట్రీస్ లో గోరుచిక్కుడు జిగురుకు చాలా డిమాండ్ ఉంది.
అయితే మీరు గోరుచిక్కుడు పంటను వేసినట్లయితే ముందుగా గోరుచిక్కుడు గింజలకు మార్కెట్ వెతుక్కోవడం మంచిది. గోరుచిక్కుడు గింజలను ఎలా ఉత్పత్తి చేయాలో ఉద్యాన శాఖ నుంచి సలహాలు పొందితే మంచిది. ఇప్పటివరకు కేవలం గోరుచిక్కుడుకాయను ఒక కూరగాయగా మాత్రమే వాడుతూ వచ్చాము. ఇకనుంచి గోరుచిక్కుడును వాణిజ్య పంటగా ఏ విధంగా సాగు చేయాలో.. గింజలనుంచి జిగురును ఎలా ప్రాసెస్ చేయాలో కూడా తెలుసుకుంటే మంచిది. తద్వారా మీరు గోరుచిక్కుడు గింజల నుంచి జిగురును తయారు చేసి, నేరుగా పరిశ్రమలకు విక్రయించవచ్చు. తద్వారా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.