Site icon NTV Telugu

హ్యుందాయ్ భారీ ప్ర‌ణాళిక‌… 4వేల కోట్ల‌తో… ఇండియాలో…

ద‌క్షిణ కొరియా కార్ల దిగ్గ‌జం హ్యుందాయ్ ఇండియాలో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు సిద్ద‌మ‌యింది.  ఎలక్ట్రిక్ వాహ‌నాల వినియోగం ఇటీవ‌ల కాలంలో భారీగా పెరిగింది.  ప‌ర్యావ‌ర‌ణ ఇబ్బందుల‌తో పాటుగా చ‌మురు ధ‌ర‌లు కూడా భారీగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌వైపు మొగ్గుచూపుతున్నారు.  హ్యుందాయ్ కంపెనీ ఇప్ప‌టికే కోనా ఎల‌క్ట్రిక్ పేరిట ఓ ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని రిలీజ్ చేసింది.  ఈ వాహ‌నం ఆక‌ట్టుకోవ‌డంతో ఇండియాలో 4 వేల కోట్ల రూపాయ‌ల‌తో చెన్నై స‌మీపంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్లాంట్‌ను నెల‌కొల్పేందుకు సిద్ధం అయింది.  

Read: హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే?

మొత్తం 6 మోడ‌ల్స్‌ను విప‌ణిలోకి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు హ్యుందాయ్ ప్ర‌క‌టించింది.  2028 నాటికి ఆరు కొత్త మోడ‌ల్స్ ఇండియ‌న్ రోడ్ల‌పై ప‌రుగులు తీస్తాయ‌ని హ్యుందాయ్ సంస్థ ప్ర‌క‌టించింది.   ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో వినియోగించే బ్యాట‌రీల‌ను చైనా, ద‌క్షిణ కొరియా నుంచి దిగుమ‌తి చేసుకుంటామ‌ని, ఇండియాలో ప్లాంట్ పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాక బ్యాట‌రీల‌ను ఇండియాలో త‌యారైన‌వి వినియోగిస్తామ‌ని కంపెనీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

Exit mobile version