Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తం చూసింది. ఈ అంశంపై అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలుమార్లు నువ్వా నేనా అన్నంత స్థాయిలో తలపడ్డాయి. పార్లమెంట్ లోపల, బయట పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే.. ఇప్పుడు ఆ రాఫెల్ యుద్ధ విమానాల్లో మేడిన్ హైదరాబాద్ అస్త్రాలను అమర్చనున్నారు. ఆ అస్త్రాలను భాగ్య నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)లో రూపొందించనున్నారు.
Jio 5G: శ్రీనాథ్‌జీ ఆలయం.. జియో 5జీ ఆరంభం.. ఏమిటీ అనుబంధం?
ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్‌తో బీడీఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బీడీఎల్ తయారుచేసే అస్త్ర మరియు స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ ఆయుధ వ్యవస్థలను ఈ ఒప్పందంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల్లో అమరుస్తారు. ఎగుమతి చేసే రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా వీటిని ఇన్‌స్టాల్ చేస్తారు. క్షిపణుల్లోని అన్ని రకాలను, అండర్ వాటర్ వెపన్ టెక్నాలజీని డెవలప్ చేయటానికి, వాటికి సంబంధించిన రీసెర్చ్ జరిపేందుకు బీడీఎల్.. ఐఐటీ రోపార్‌తోనూ ఎంఓయూపై సంతకాలు చేసింది.