Site icon NTV Telugu

Washing Machine: బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్ బడ్జెట్ ధరలో.. వీటిపై ఓ లుక్కేయండి

Washing

Washing

టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిసాయంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. చెమట పట్టకుండానే పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. వంట వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇళ్లు తుడవాలన్నా అన్నింటికీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడమనేది శ్రమతో కూడిన పని. కానీ, నేడు వాషింగ్ మెషిన్ల రాకతో ఈజీగా బట్టలు ఉతికేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్ బడ్జెట్ ధరలోనే వచ్చేస్తున్నాయి. ఆవివరాలు మీకోసం..

SAMSUNG Washing Machine:

ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ బ్రాండ్ కు చెందిన వాషింగ్ మెషిన్(WT65R2200LL/TL) పై 22 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ. 12,500గా ఉంది. ఆఫర్లో భాగంగా మీరు 9690కే సొంతం చేసుకోవచ్చు. ఇది 6.5 కిలోల సెమీ-ఆటోమేటిక్ టాప్-లోడింగ్ వాషింగ్ మెషిన్. ఇది ఫాబ్రిక్‌కు నష్టం కలిగించకుండా దుస్తులను పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఇది ఎయిర్ టర్బో ఫీచర్ ను కలిగి ఉంది. ర్యాట్ ప్రొటెక్షన్, రస్ట్ ప్రూఫ్ బాడీ, క్యాస్ట్రో వీల్స్ తో వస్తుంది.

LG Washing Machine:

బడ్జెట్ ధరలో క్వాలిటీ, బ్రాండెడ్ వాషింగ్ కావాలనుకుంటే ఎల్జీ బ్రాండ్ కు చెందిన వాషింగ్ మెషిన్ (P6001RGZ) అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో దీని అసలు ధర రూ. 14490గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 9990కే సొంతం చేసుకోవచ్చు. అంటే 31 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకమైన రోలర్ జెట్ పల్సేటర్ ను కలిగి ఉంది. ఇది 6 కిలోల కెపాసిటితో వస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్.

Whirlpool Washing Machine:

Whirlpool Semi-Automatic Washing Machine (MAGIC CLEAN 6.5 GREY (5YR) సామర్థ్యం 6.5 కిలోలు. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్. బట్టలు పూర్తిగా శుభ్రం చేయడానికి ఇన్బిల్ట్ స్క్రబ్బర్, 3 వాష్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. రస్ట్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. క్యాస్ట్రో వీల్స్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ పై 29 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 12,700గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 8,970కే సొంతం చేసుకోవచ్చు.

Exit mobile version