1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
- SIPతో రూ.1 కోటి సంపద ఎలా సాధించాలి?
- నెలకు రూ.10,000 SIPతో 20 ఏళ్లలో భారీ కార్పస్..
- 12% వార్షిక రాబడి అంచనాతో SIP లెక్కలు..
- 20 ఏళ్లలో రూ.10,000 SIPతో సుమారు రూ.91.98 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 Crore Investment Plan: షేర్ మార్కెట్లో గత కొన్ని నెలలుగా ఎక్కువ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీని వల్ల చాలా మంది పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో పెరగడం లేదు. కొందరికి మాత్రం భారీ నష్టాలు కూడా ఎదురయ్యాయి. దీనితో చాలా మందికి SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ఒక్కటే ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది. నిజానికి దీనికి కారణం లేకపోలేదు.
SIP దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించడానికి, రిటైర్మెంట్ లేదా ఇతర లక్ష్యాల కోసం ఆర్థిక సహాయం సమకూర్చుకోవడానికి మంచి మార్గంగా పరిగణించబడుతుంది. సాధారణ పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో 1 కోటి రూపాయల కార్పస్ ఒక పెద్ద లక్ష్యం. అయితే ఈ 1 కోటి ఎలా సాధించాలి? ప్రతి నెలా ఎంత SIP చేయాలి? సాధారణ SIP చేస్తే ఎంత సమయం పడుతుంది? స్టెప్-అప్ SIP ఎంచుకుంటే లక్ష్యం ఎంత త్వరగా పూర్తవుతుంది? అనేక ప్రశ్నలు ఉంటాయి.
Also Read
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక సగటు రాబడి సంవత్సరానికి 12% అని సాధారణంగా పరిగణిస్తారు. ఈ ఆధారంగా చూస్తే, 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000లు SIP చేస్తే మీ మొత్తం పెట్టుబడి 24 లక్షలు అవుతుంది. అలాగే 12% వార్షిక రాబడితో మీకు సుమారు 91.98 లక్షల నిధి ఏర్పడుతుంది. అందులో రాబడి నుంచి వచ్చే ఆదాయం సుమారు 67.98 లక్షలు.
15 సంవత్సరాలకు లక్ష్యం పెట్టుకుంటే ప్రతి నెలా 20,000 రూపాయలు SIP చేయాలి. ఆలా చేస్తే మొత్తం పెట్టుబడి 36 లక్షలు అవుతుంది. 12% రాబడితో సుమారు 95.18 లక్షల నిధి ఏర్పడుతుంది. రాబడి నుంచి వచ్చే ఆదాయం సుమారు 59.18 లక్షలు
.
మరోవైపు స్టెప్ అప్ SIP వల్ల మరింత బలమైన లాభం వస్తుంది. మీరు రూ.10,000ల SIPతో ప్రారంభించి ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటే 1 కోటి రూపాయల నిధి కేవలం 13 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. అదేవిధంగా 5,000 రూపాయల చిన్న SIPతో ప్రారంభించి ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటే 1 కోటి రూపాయల కార్పస్ సుమారు 15 సంవత్సరాలు కొన్ని నెలల్లోనే సాధ్యమవుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య SIP దీర్ఘకాలికంగా క్రమశిక్షణతో పెట్టుబడి చేయడానికి అనువైన మార్గం. సాధారణ SIPతో పాటు స్టెప్-అప్ SIP ఎంచుకుంటే మీ లక్ష్యాలు మరింత త్వరగా చేరుకోవచ్చు.
తాజావార్తలు
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!