NTV Telugu Site icon

Hindenburg: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అదానీపై సంచలన ఆరోపణలు..

Hindenburg

Hindenburg

అదానీ కేసులో సెబీ చీఫ్‌పై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్‌కు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తెలిపింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టబడిన ఆఫ్‌షోర్ ఫండ్‌లో బుచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని పత్రాలను ఉటంకిస్తూ హిండెన్‌బర్గ్ తెలిపింది.

READ MORE: Sarabjot Singh-Job: నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు: సరబ్‌జ్యోత్‌

‘నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గుర్తించాం. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. విజిల్‌బ్లోయర్‌ పత్రాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయి. ఇందులో మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయి’ అని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది.

READ MORE:Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..

అదానీ మనీ సైఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన ఆఫ్‌షోర్ సంస్థలలో సెబీ చైర్మన్ మధాబి పూరీ బుచ్‌కు వాటా ఉందని విజిల్‌బ్లోయర్ నుంచి పొందిన పత్రాలు చూపిస్తున్నాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. విజిల్‌బ్లోయర్ పత్రాలను ఉటంకిస్తూ.. బుచ్ జూన్ 5, 2015న సింగపూర్‌లో ఐపీఈ ప్లస్ ఫండ్ 1తో తన ఖాతాను తెరిచినట్లు నివేదిక పేర్కొంది. ఆఫ్‌షోర్ మారిషస్ ఫండ్‌ను ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా అదానీ డైరెక్టర్ ఏర్పాటు చేశారని, పన్ను స్వర్గధామమైన మారిషస్‌లో నమోదు చేయబడిందని తెలిపింది.

Show comments