Site icon NTV Telugu

Heritage Foods: నేషనల్‌ బ్రాండ్‌ అవ్వాలని హెరిటేజ్‌ ప్లాన్‌

Heritage Foods

Heritage Foods

Heritage Foods: హెరిటేజ్‌ ఫుడ్స్‌ని నేషనల్‌ బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని కంపెనీ యాజమాన్యం భవిష్యత్‌ ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రొడక్టుల మ్యానిఫ్యాక్షరింగ్‌ కెపాసిటీలను పెంచుకోవాలని నిర్ణయించింది. పాల సేకరణ కోసం పల్లె స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు, 11 రాష్ట్రాల్లో 121 డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు, ఒకటీ పాయింట్‌ మూడు లక్షల రిటైల్‌ ఔట్‌లెట్లు, 859 పార్లర్లు ఉన్నాయి.

also read: High Court: అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే..!!

నిత్యం 26 లక్షలకు పైగా లీటర్ల పాలను ప్రాసెస్‌ చేస్తోంది. సేల్స్‌ నెట్‌వర్క్‌ను కొత్త ప్రాంతాల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్‌, ఫ్రెష్‌ ప్రొడక్టులు అనగానే జాతీయ స్థాయిలో సైతం తమ పేరే గుర్తొచ్చే స్థాయికి ఎదగాలని హెరిటేజ్‌ సంస్థ అనుకుంటోంది. విలేజ్‌ లెవల్‌లో బల్క్‌ కూలర్లను ఏర్పాటుచేయనుంది. చిల్లింగ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా పాల సేకరణను పెంచనుంది. టోటల్‌ రెవెన్యూలో వ్యాల్యూ యాడెడ్‌ ప్రొడక్టుల(వీఏపీ) ఇన్‌కమ్‌ని పెంచుకోవటం కోసం మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది.

గతేడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో వీఏపీ ఆదాయం 25.7 శాతం మాత్రమే కాగా కన్నా ఈసారి అది 27.03కి పెరిగింది. రివ్యూ చేస్తున్న క్వార్టర్‌లో వీఏపీ రెవెన్యూ 28.86 శాతం గ్రోత్‌ నమోదు చేసింది. ఫలితంగా రూ.169.6 కోట్ల నుంచి రూ.218.6 కోట్లకు వృద్ధి సాధించింది. పెరుగు అమ్మకాలు 16.69 ఎక్కువ జరిగాయి. రోజువారీ విక్రయాలు 326 టన్నులకు చేరాయి.

Exit mobile version