Haldiram IPO: స్టాక్ మార్కెట్లోకి ‘హల్దీరామ్’ గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా రూ. 10 వేల కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haldiram IPO: భారత స్టాక్ మార్కెట్లో మరో మెగా ఐపీఓ సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా స్వీట్లు, స్నాక్స్‌కు పెట్టింది పేరైన దిగ్గజ సంస్థ ‘హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్’ పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు అధికారికంగా అడుగులు వేసింది. ఏకంగా రూ. 10,000 కోట్ల (సుమారు 1 బిలియన్ డాలర్లు) భారీ ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు కంపెనీ పక్కా ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఈ ఇష్యూలో హల్దీరామ్ వాల్యుయేషన్ రూ. 1 లక్ష కోట్లకు పైగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీఓ ప్రక్రియను వేగవంతం చేసేందుకు హల్దీరామ్ సంస్థ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘EY’ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ (PMO)గా నియమించుకుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయం, నిబంధనల నిర్వహణ కోసం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కంపెనీ వ్యాపార విస్తృతి చాలా పెద్దది కావడంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 6 నుంచి 12 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 చివర్లో హల్దీరామ్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓలో కొత్త షేర్ల జారీ (ఫ్రెష్ ఇష్యూ)తో పాటు పాత వాటాదారుల షేర్ల విక్రయం (OFS) కూడా ఉండనుంది. మరోవైపు, కోకా-కోలా ఇండియా కూడా తన బాట్లింగ్ విభాగమైన ‘హిందుస్థాన్ కోకా-కోలా హోల్డింగ్స్’ను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇప్పటికే సెబీకి పత్రాలు సమర్పించింది.
Also Read
- Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
- Recykal: సచిన్ టెండూల్కర్ సరికొత్త ఇన్నింగ్స్.. క్లీన్ ఇండియా కోసం మాస్టర్ బ్లాస్టర్ బిగ్ స్టెప్!
- India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
ఢిల్లీకి చెందిన ‘హల్దీరామ్ స్నాక్స్’, నాగ్‌పూర్‌కు చెందిన ‘హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్’ విలీనం తర్వాత ఈ కొత్త సంస్థ ఏర్పడింది. భారత ప్యాకేజ్డ్ స్నాక్స్ మార్కెట్‌పై భారీ అంచనాలతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. గతేడాది మార్చి-ఏప్రిల్ మధ్య సింగపూర్‌కు చెందిన టెమాసెక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్, యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీలు కలిసి 15 శాతం వాటాను కొనుగోలు చేశాయి. భారత కన్జ్యూమర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్‌గా నిలిచింది. ఆ తర్వాత డిసెంబర్లో అమెరికన్ సంస్థ ‘ఎల్ క్యాటర్టన్’ కూడా ఇందులో పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ప్రమోటర్లయిన అగర్వాల్ కుటుంబం చేతిలో మెజారిటీ వాటా ఉంది. వ్యాపార పరంగానూ హల్దీరామ్ దూసుకుపోతోంది. క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే కంపెనీ రూ. 7,762 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఆపరేటింగ్ మార్జిన్ 19 శాతంగా ఉండటం విశేషం. అమెరికా టారిఫ్‌ల వల్ల ఎగుమతుల్లో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తులతో రాబోయే రోజుల్లో కంపెనీ ఆదాయం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Haldiram IPO: స్టాక్ మార్కెట్లోకి ‘హల్దీరామ్’ గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా రూ. 10 వేల కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
-
Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
-
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!