Site icon NTV Telugu

Government Scheme : సూపర్ స్కీమ్.. రూ. 20 వేలు పెట్టుబడితో రూ. 2 లక్షలు మీ సొంతం..

Pmsby

Pmsby

డబ్బులను పొదుపు చెయ్యాలనే ఆలోచన అందరికీ అందరికీ ఉంటుంది.. ప్రభుత్వం ఎన్నో రకాల పొదుపు పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మంచి రాబడిని అందిస్తున్నాయి.. ఆ స్కీమ్ లో డబ్బులను పెడితే అమౌంట్ డబుల్ అవ్వడమే కాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అలా పథకాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ కూడా ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రమాదంలో చనిపోయిన లేదంటే వైకల్యం పొందిన ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా విపత్తు జరిగి సహజ మరణం పొందిన లేదంటే వైకల్యం వంటివి ఏర్పడిన ఈ పథకం కింద మీకు డబ్బు వస్తుంది. ఈ స్కీం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచింది..ఈ పేమెంట్ లకు ఆటో డెబిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీలోగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ పద్ధతిలో ఈ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది.. జూన్ 1 నుంచి ఈ పథకం అమలు అవుతూ వస్తుంది..

ఈ పథకంలో చేరాలేనుకొనేవారు https://www.jansuraksha.gov.in/Forms-PMSBY. aspx ద్వారా మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని పూర్తిగా నింపి బ్యాంకులో అందజేయాలి. దీనికోసం 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఈ స్కీంలో లబ్ధిదారుడు ప్రమాదానికి గురై చనిపోయిన లేదంటే శాశ్వత వైకల్యానికి గురైన రూ.2లక్షలు పొందుతారు.. అలాగే పాక్షిక వైఖల్యం ఏర్పడితే రూ.1 లక్ష రూపాయలు బెనిఫిట్ కూడా ఉంటుంది.. ఇంకా పన్ను మినహాయింపుతో పాటుగా లోన్ తీసుకొనే సదుపాయం కూడా ఉంటుంది..

Exit mobile version