Site icon NTV Telugu

Gopuff Layoff: గోపఫ్.. 200 మందికి పైగా స్టాఫ్ ఉఫ్

Gopuff Layoffs

Gopuff Layoffs

Gopuff Layoff: అమెరికన్ కన్జ్యూమర్ గూడ్స్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీ గోపఫ్ రీసెంటుగా 200 మందికి పైగా కస్టమర్ సర్వీస్ ఉద్యోగులను తొలగించింది. జులై రౌండ్ లేఆఫ్ లో భాగంగా వీళ్లను తీసేసినట్లు తెలిపింది. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనంతోపాటు నిధుల సమీకరణ నెమ్మదించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాలపై ఫోకస్ పెట్టేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్క్ ఫోర్సును 10 శాతం తగ్గించుకోనున్నట్లు గోపఫ్ జులై నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Buy Now Pay Later: ‘పైన్ ల్యాబ్స్’వారి.. బై నౌ పే లేటర్‌కి.. చిన్న టౌన్లలో పెద్ద డిమాండ్

ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వల్ల కస్టమర్‌ సర్వీస్‌ టీమ్‌తోపాటు ఫుల్‌ టైమ్‌ ఎంప్లాయీస్‌, టెంపరరీ వర్కర్స్‌ పైన ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. గోపఫ్‌ సంస్థ కస్టమర్‌ సర్వీస్‌ ఆపరేషన్స్‌ని ఎక్కువ శాతం ఫిలిప్పీన్స్‌కి ఔట్‌ సోర్సింగ్‌కి ఇచ్చినట్లు తెలుస్తోంది. లేఫ్‌ఆఫ్‌ వల్ల అత్యధికంగా 250 లోపు మందే ఉద్యోగాలు కోల్పోతారని సమాచారం. ఈ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. అందువల్ల జులై లేఆఫ్‌ అనేది రెండో విడత కిందికి వస్తుంది.

ఒకప్పుడు హాట్‌ డెలివరీ స్పేస్‌గా పేరొందిన గోపఫ్‌ వాస్తవానికి ఈ ఏడాది పబ్లిక్‌ ఆఫరింగ్‌కి రావాలని ఆశించింది. కానీ.. ఆ ప్రణాళికలను వాయిదా వేసింది. ప్రస్తుతానికి లాభాలపై ఫోకస్‌ పెట్టి కాస్ట్‌ కటింగ్‌కు దిగింది. లేటెస్ట్‌గా ఉద్యోగాలు కోల్పోయినవాళ్లు సోషల్‌ మీడియా వేదికగా ఈ వార్తను షేర్‌ చేశారు. ‘‘మన కొలువులు ఊడాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎవరైనా ఏదైనా అనుమానం ఉంటే హెచ్‌ఆర్‌ని సంప్రదించొచ్చు’’ అంటూ ట్విట్టర్‌, రెడ్డిట్‌, లింక్డిన్‌లలో పేర్కొన్నారు.

Exit mobile version