Site icon NTV Telugu

Google Layoffs: 10 శాతం ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్..

Google Layoffs

Google Layoffs

Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్‌మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను ప్రకటించారు.

Read Also: Delhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఏఐ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పోటీ కారణంగా ఇతర కంపెనీల మాదిరిగానే గూగుల్ కూడా ఈ ఏడాది కష్టాలను ఎదుర్కొంది. నివేదిక ప్రకారం, గూగుల్ కూడా తన వ్యాపారాన్ని రెండేళ్లుగా పునర్నిర్మిస్తోంది. పరిశ్రమలో పెరిగిన పోటీ మధ్య టెక్ దిగ్గజం తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని, పోటీలో ఉండటానికి చొరవ తీసుకుంటోంది. గూగుల్ లేఆఫ్స్ 2025 న్యూఇయర్‌లో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తక్కువ పనితీరు ఉన్న ఉద్యోగులను జనవరిలో తొలగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజా లేఆఫ్స్‌కి ముందు సెప్టెంబర్ 2022లో గూగుల్ 20 శాతం మందిని తొలగించింది. ఫలితంగా 12,000 మందిని తొలగించింది.

తాజా లేఆఫ్స్‌ కంపెనీ మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్స్ సహా ఆపరేషనల్ రోల్స్‌ని ప్రభావితం చేస్తుంది. గూగుల్ 20 శాతం మరింత సమర్థవంతంగా పనిచేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. OpenAI ఇటీవల తన న్యూ టూల్, ChatGPT సెర్చ్‌ని ఆవిష్కరించింది. ఇది ఏఐ‌ని ఉపపయోగించి రియల్ టైమ్‌లో అప్డేట్స్‌ని యాక్సెస్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇస్తోంది. ఈ పరిణామం రెండు దశాబ్ధాలుగా మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన గూగుల్ సెర్చ్‌కి ముప్పు తెచ్చే అవకాశం ఏర్పడింది.

Exit mobile version