NTV Telugu Site icon

Google: మొబైల్ వాడేవారికి అలర్ట్.. ఇకపై ఆ ఫోన్‌లలో గూగుల్ సర్వీసులు పనిచేయవు..!!

Google Mobile Services

Google Mobile Services

Google Mobile Services: మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడుతున్నారా? అయితే గూగుల్ కీలక ప్రకటన చేసింది. 1 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఫోన్లలో గూగుల్ మొబైల్ సర్వీస్(GMS) సేవలను నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. 1 జీబీ ర్యామ్/8 జీబీ ఇంటర్నల్ మెమొరీతో విడుదలయ్యే బడ్జెట్ ఫోన్ల కోసం గూగుల్ గతంలో ఆండ్రాయిడ్ గో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్ని యాప్‌లు లైట్ వెర్షన్‌లో ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయాలంటే 2 జీబీ ర్యామ్/16 జీబీ మెమొరీ తప్పనిసరి. త్వరలో ఈ సేవలను కూడా పూర్తిగా గూగుల్ నిలిపివేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఎందుకంటే గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను విడుదల చేయనుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 13 గో వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also:Sun Colour: సూర్యుడు ఏ రంగులో ఉంటాడో తెలుసా..? పసుపు రంగు మాత్రం కాదు.

ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లలో పేమెంట్ యాప్స్ పెరిగిపోవడంతో భద్రత సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో భద్రతకు సంబంధించి అడ్వాన్సుడ్ ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సాధారణ ఆండ్రాయిడ్ ఓఎస్ పనిచేయాలంటే తప్పనిసరిగా మొబైల్‌లో 4జీబీ ర్యామ్ సామర్థ్యం ఉండి తీరాలి. ఆండ్రాయిడ్ గో వెర్షన్ పనిచేయాలంటే 2జీబీ ర్యామ్ సామర్థ్యం ఉండాలి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల నాటికి ఇది 3జీబీ సామర్థ్యానికి మారుతుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే మొబైల్ పనితీరు వేగంగా ఉండాలంటే భవిష్యత్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ గో వెర్షన్‌ను నిలిపివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show comments