NTV Telugu Site icon

SBI : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..

Sbi

Sbi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.. బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంక్ బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరగనున్నాయని తెలుస్తుంది…

ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కన్నా ఎక్కువ బ్రాంచ్ లను స్టార్ట్ చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.. ఈ క్రమంలో కొత్తగా 300 బ్రాంచులను ప్రారంభించాలని బ్యాంక్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశ వ్యాప్తంగా 22,405 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. విదేశీల్లో కూడా ఎస్‌బీఐకి బ్రాంచులు ఉన్నాయి. 235 వరకు బ్రాంచులు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బ్రాంచుల పరంగా చూస్తే ఎస్‌బీఐ కూడా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోందని చెప్పుకోవచ్చు.. డిజిటల్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని చూస్తున్నాం. అలాగే ఫిజికల్ బ్రాంచుల సంఖ్యను కూడా మరింత పెంచుకుంటాం. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలో 300 బ్రాంచులను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఎక్కడ అయితే బ్యాంక్ బ్రాంచ్ అవసరం ఉందో అక్కడ కొత్తగా బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని బ్యాంక్ చైర్మన్ అధికారికంగా ప్రకటించారు..

అంతేకాదు మరోవైపు బ్యాంక్ స్పెషల్ స్కీమ్ ను అందిస్తుంది.. ఎస్‌బీఐ అమృత్ కలశ్. ఈ స్కీమ్ విషయానికి వస్తే.. దీని టెన్యూర్ 400 రోజులు ఉంటుంది. మీకు ఈ స్కీమ్‌పై 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే సాధారణ కస్టమర్లకు అయితే 7.1 శాతం వడ్డీ ఉంటుంది. ఈ స్కీమ్ ఆగస్ట్ 15 వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. అంటే ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి ఉండదు. పరిమిత కాలం డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఇప్పటివరకు బ్యాంక్ అందిస్తున్న అన్ని స్కీమ్ లలో ఈ స్కీమ్ బెస్ట్ గా ఉందని చెప్తున్నారు.. అధిక వడ్డీని పొందవచ్చు.. మీకు స్కీమ్ లో చేరాలనుకుంటే మరి కొద్ది గంటలే ఉందని మర్చిపోకండి..