NTV Telugu Site icon

TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు

Tcs

Tcs

దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచమంతా ఉద్యోగులను వణికిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగ అవకాశాలపై ఎక్కువగా ఉండదని ఇటీవల కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5452 మంది ఉద్యోగులను కూడా నియమించినట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి పెరిగినట్లు టీసీఎస్ యాజమాన్యం పేర్కొంది. దీంతోపాటు ఉద్యోగుల వేతనాలను కూడా సవరించింది. ప్రస్తుతం ఉన్న వేతనాలను 4.5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. అలాగే ప్రతి 5 రోజులకోసారి కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా 70 శాతానికి పెరిగినట్లు టిసిఎస్ పేర్కొంది.

READ MORE: Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్‌లో ఇంటర్నెట్ బంద్..

ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకుంటున్న ఆఫీసులో ఉద్యోగుల హాజరు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయాల నుంచి పనిచేసే ఉద్యోగుల శాతం కోవిడ్ మహమ్మారి కంటే ముందు స్థాయికి చేరుకున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ విభాగం అధిపతి మిలింద్ లక్కడ్ తెలిపారు. 18 నెలల కృషి అనంతరం ఈ స్థాయిని సాధించగలిగామని వెల్లడించారు. నిజానికి కోవిడ్‌కు ముందు ఉన్న ఉద్యోగుల హాజరు స్థాయికి దాదాపుగా తిరిగి వస్తున్నామని చెప్పారు. ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలో 70 శాతం కంటే ఎక్కువ మంది ఆఫీసుకు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Show comments