NTV Telugu Site icon

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

Goldrates

Goldrates

పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,160గా నమోదైంది.

ఇది కూడా చదవండి: Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

మరోవైపు వెండి ధరలు మాత్రం షాకిస్తున్నాయి. రెండు రోజుల నుంచి వరుసగా వెండి ధర పెరుగుతోంది. నిన్న రూ.1000 పెరగగా.. నేడు మరో రూ.100 పెరిగింది. దీంతో శుక్రవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.99,100గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,08,100గా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: IND vs NZ Final 2025: ఫైనల్లో వాళ్లిద్దరిని ఆపకపోతే భారత్కు దబిడి దిబిడే..