శ్రావణ మాసంలో బంగారం ధరలు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు మొదలు కావడంతో పసిడి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గత వారం దాకా హెచ్చుతగ్గులుగా ఉన్న ధరలు ఈ వారం మాత్రం హడలెత్తిస్తున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధర.. ఈరోజు మాత్రం అమాంతంగా భారీగా పెరిగింది. తులం బంగారం ధర రూ. 820 పెరిగింది. ఇక సిల్వర్ ధర కూడా షాకిచ్చింది. కేజీ వెండి ధరపై రూ.2,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు.. న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం
24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 820 రూపాయలు పెరిగి.. రూ.1,02, 220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 750 రూపాయిలు పెరిగి.. తులం బంగారం ధర రూ. 93,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 620 రూపాయిలు పెరిగి 10 గ్రాముల ధర రూ.76,700 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల తీరు బాధించింది
ఇక వెండి ధర కూడా పైపైకి పోతుంది. గత వారం యథాస్థితిలో ఉన్న ధర.. మంగళవార మాత్రం ఏకంగా రూ.2,000 పెరిగింది. కేజీ వెండి రూ.1,15, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 25, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,15,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.
