Site icon NTV Telugu

Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold

Gold

పసిడి ప్రియులకు శుభవార్త. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయోనని భయాందోళన చెందుతున్న తరుణంలో మగువలకు తీపికబురు. నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో భారీ ఊరట లభించింది. తులం గోల్డ్‌పై రూ.1,530 తగ్గగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.

తులం గోల్డ్‌పై రూ.1,530 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,400 తగ్గడంతో రూ.1,38,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,440 తగ్గడంతో రూ.1,13,570 దగ్గర ట్రేడ్ అవుతోంది.

హమ్మయ్య.. సిల్వర్ ధర కూడా భారీ దిగొచ్చింది. గురువారం కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,50, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,55,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,50, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

Exit mobile version