పశ్చిమాసియా యుద్ధం వేళ బంగారం ధరలపై ఒకింత భయాందోళనలు ఉండేవి. భారీగా ధరలు పెరగవచ్చేమోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ అందుకు భిన్నంగా ధరలు దిగొస్తున్నాయి. మధ్యప్రాచ్యం యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు పూర్తయింది. గతం కంటే భిన్నంగా ధరలు బాగా తగ్గాయి. శుభాకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌లో ఇది సామాన్యులకు.. మగువలకు శుభవార్తగానే చెప్పొచ్చు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 810 తగ్గగా.. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది.
తులం గోల్డ్‌పై రూ.810 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.750 తగ్గడంతో రూ.1,35,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.610 తగ్గడంతో రూ.1,10,460 దగ్గర ట్రేడ్ అవుతోంది.
సిల్వర్ ధర కూడా ఊరట కలిగించింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,45, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,50,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,45, 000 దగ్గర అమ్ముడవుతోంది.
