Site icon NTV Telugu

Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold

Gold

ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు తారుమారయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. అంతేకాకుండా మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంతా భావించారు గానీ.. అందుకు భిన్నంగా ధరలు రివర్స్ అయ్యాయి. వెండి, బంగారం ధరలు దిగి రావడం మగువలకు ఇది శుభపరిణామంగానే చెప్పొచ్చు. అంతేకాదు.. పెళ్లిళ్ల సీజన్‌లో సామాన్యులకు భారీ ఊరటే అని చెప్పక తప్పదు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,780 తగ్గగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.

తులం గోల్డ్‌పై రూ.2,780 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,550 తగ్గడంతో రూ.1,41,750 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,090 తగ్గడంతో రూ.1,15,980 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఈరోజు సిల్వర్ ధర కూడా ఊరట కలిగించింది. ఈరోజు కిలో వెండి ధరపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version