ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. అనంతరం వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మరలా షాక్ ఇస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నిన్న స్వల్పంగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము పసిడి ధర రూ.229 పెరిగి.. రూ.12,780 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.210 పెరిగి.. 11,715గా కొనసాగుతోంది.
గురువారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,27,800గా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,150గా నమోదయింది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.2,290.. 22 క్యారెట్లపై రూ.2,100 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల రేటు రూ.1,17,150గా పలుకుతోంది. విశాఖ, విజయవాడలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.
Also Read: Jigris Movie Review: జిగ్రీస్ మూవీ రివ్యూ.. హీరోయిన్, గ్లామర్ డోస్ లేని సినిమా ఎలా ఉందంటే?
ఇక వెండి ధర మాత్రం నేడు ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 10 వేలు పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.10,000 పెరిగి.. రూ.1,72,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రూ.1,82,000గా నమోదైంది. విశాఖ, విజయవాడలో కూడా రూ.1,82,000గా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
