Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020లుగా ఉంది. నిన్నటితో (జూన్ 23) పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 430 తగ్గింది.
జూన్ 19 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 70, 300, 200, 400లుగా తగ్గుతూ వచ్చింది. బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
Also Read: KP Chowdary: డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరు తెలుగు హీరోయిన్లు.. అడ్డంగా బుక్కయ్యారుగా!
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,400 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు పసిడి బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 71,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 74,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Ashu reddy: డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. వందల ఫోన్ కాల్స్.. అవకాశాలు లేకున్నా లగ్జరీ లైఫ్ అందుకేనా?