NTV Telugu Site icon

Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! హైదరాబాద్‌లో తులం ఎంతంటే

Gold Price

Gold Price

Gold and Silver Price Today 21st June 2023 in Hyderabad: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గత మూడు రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు (జూన్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 70 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 70 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో ప్రతిరోజు మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,150గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,350లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,000గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ.74,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 78,600లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,600లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,600ల వద్ద కొనసాగుతోంది.

Also Read: Elon Musk: భారత ప్రధాని మోడీతో ఎలాన్ మస్క్ సమావేశం