NTV Telugu Site icon

Gold Price: గుడ్‌ న్యూస్‌.. మళ్లీ 50 వేల దిగువకు..

Gold

Gold

పసిడి ప్రేమికులకు షాకిస్తూ.. రూ.51 వేలకు పైగా చేరిన 10 గ్రాముల బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ కిందకు దిగింది.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.50 వేల దిగువకు పడిప్ఓయింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు.. దేశీయంగా డిమాండ్‌ కాస్త తగ్గడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర కిందకు దిగివచ్చిందంటున్నారు.. దాదాపు ఒక ఏడాది తర్వాత ఢిల్లీ మార్కెట్‌లో గరిష్ట స్థాయి ధరను రూ.50,350కు చేరుకున్న 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర.. ఇవాళ రూ.900కి పైగా దిగిరావడం విశేషం. ఇవాళ ధరల ప్రకారం.. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.916 తగ్గి రూ.49,440కు పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,287 క్షీణించింది.

Read Also: Airtel: గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే ఓటీటీ సర్వీసెస్‌ ఏడాది ఫ్రీ..!

అయితే, హైదరాబాద్‌ బులెలియన్‌ మార్కెట్‌లో మాత్రం రూ.50 మార్క్‌ దిగవకు రాలేదు.. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.46,200కు దిగిరాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.50,400కి క్షీణించింది.. ఇక, బంగారం దారిలోనే పసిడి ధర కూడా దిగివచ్చింది.. రూ.1400కి పైగా తగ్గాపోయి రూ.63,045కి పడిపోయింది కిలో వెండి ధర. మొత్తంగా క్రితం సెషన్‌లో ఏడాది గరిష్ట స్థాయికి చేరిన తర్వాత బుధవారం భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ గత ముగింపు రూ.49,385 నుండి 10 గ్రాములకు రూ.27 తగ్గి రూ.49,358 వద్ద ట్రేడవుతున్నాఇ.. ప్రపంచవ్యాప్తంగా, పసుపు మెటల్ ధరలు పడిపోవడం.. ఉక్రెయిన్ ప్రతిష్టంభన ప్రభావం స్పష్టంగా ఉందని.. స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి 1,850.91 డాలర్లకు పడిపోగా.. U.S. గోల్డ్ ఫ్యూచర్స్ లో 0.2 శాతం తగ్గి 1,852.40కి క్షీణించింది..