వామ్మో.. బంగారం, వెండికి ఏమైంది? రాకెట్‌లా ధరలు దూసుకుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు మొదలయ్యాయి. బంగారం లేనిదే పెళ్లిళ్లు జరగలేని పరిస్థితి. దీంతో సామాన్యుడి గుండె ఝల్లుమంటోంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు బంగారం, వెండి.. రెండు కూడా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లిపోతున్నాయి. తులం గోల్డ్‌పై రూ.5,400 పెరగగా.. కిలో వెండిపై రూ.15,000 పెరిగింది. దీంతో వామ్మో.. అంటూ హడలెత్తిపోతున్నారు.
తులం గోల్డ్‌పై రూ.5,400 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,59,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.4,950 పెరగడంతో రూ.1,46,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.4,050 పెరగడంతో రూ.1,19,780 దగ్గర ట్రేడ్ అవుతోంది.
సిల్వర్ భారీ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.15,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,60,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. దీంతో రికార్డ్ స్థాయిలో వెండి ధర దూసుకుపోతుంది. అతి త్వరలోనే 4 లక్షల మార్కు దాటేయనుంది.
