Site icon NTV Telugu

Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్స్

Gold

Gold

పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం ట్రంప్ సుంకాల కారణంగా బంగారం ధరలు కొండెక్కాయి. రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. శ్రావణమాసంలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు. ఈ వారం కూడా ధరలు మరింత పెరగొచ్చన్న నిపుణుల హెచ్చరికలతో బెంబేలెత్తిపోయారు. కానీ ఈ వారం మాత్రం కాస్తా ధరలు ఉపశమనం కలిగించాయి. తులం బంగారం ధర రూ. 760 తగ్గింది. ఇక వెండి ధరలు కూడా ఉపశమనం కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!

24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 760 రూపాయలు తగ్గి.. రూ.1,02, 280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 700 రూపాయిలు తగ్గి.. తులం బంగారం ధర రూ. 93,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 570 రూపాయిలు తగ్గి 10 గ్రాముల ధర రూ.76,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కేజీ వెండి రూ.1,17, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 27, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి మిస్సింగ్.. ఆచూకీ కోసం కేంద్రానికి లేఖ

Exit mobile version