NTV Telugu Site icon

Gold Rate Today: మహిళలకు శుభవార్త.. మరింత తగ్గిన పసిడి ధర

Gold Rate

Gold Rate

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నా దేశీయంగా మాత్రం దిగివస్తున్నాయి… వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గి మహిళలకు, బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త చెప్పాయి.. హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర రూ. 270 తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గడంతో.. రూ. 51,440కి దిగివచ్చింది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 250 దిగివచ్చి.. రూ. 47,150కి క్షీణించింది. రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధర భారీగా తగ్గిపోయింది.

Read Also: Presidential Poll: రాష్ట్రపతి ఎన్నికల రేసులో గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా..!

ఇక, బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 47,400గా ఉండగా.. వరుసగా చెన్నై, ముంబై మరియు కోల్‌కతాలో రూ. 47,550, రూ. 47,400, రూ. 47,400 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర రూ.47,400గా కొనసాగుతోంది.. మొత్తంగా నాలుగు రోజులుగా మార్కెట్‌లో ట్రేడవుతున్న బంగారం ధరలు నిన్న తగ్గుముఖం పట్టాయి. మరోవైపు.. బంగారం ధర దిగివస్తే.. సిల్వర్‌ రేటు నిలకడగా కొనసాగుతోంది.. ఎలాంటి మార్పులు లేకుండా వెండి కిలో ధర రూ. 66 వేల వద్దనే కొనసాగుతోంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి ఎగబాకింది.. పసిడి రేటు ఔన్స్‌కు 0.85 శాతం మేర పెరగడంతో 1835 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఔన్స్‌కు 1.34 శాతం పెరుగుదల నమోదు చేయడంతో 21.70 డాలర్లకు ఎగబాకింది.

కాగా, గత కొన్నేళ్లుగా బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ కంచెగా పనిచేస్తోందని చెప్పవచ్చు. పెట్టుబడిదారులు బంగారాన్ని ప్రధాన పెట్టుబడి వస్తువుగా చూస్తున్నారు. అందుకని, బంగారం మార్కెట్‌లో అత్యుత్తమ పెట్టుబడి వస్తువులలో ఒకటి. చాలా మంది నిపుణులు బంగారం నేడు అత్యంత సురక్షితమైన పెట్టుబడి అని చెబుతుంటారు.. ముఖ్యంగా భారతీయులకు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.