Site icon NTV Telugu

ఈరోజు పెరిగిన బంగారం ధరలు…

గ‌త రెండు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధ‌ర‌లు ఈరోజు మరోసారి పెరిగాయి. ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,000 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి రూ. 49,090 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 300 తగ్గి 72,900 పలుకుతుంది.

Exit mobile version