గోల్డ్ లవర్స్‌కి ధరలు మళ్లీ షాకిచ్చాయి. శుక్రవారం అమాంతంగా ధరలు పెరిగాయి. బంగారం ధరలు ప్రతి రోజూ హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. ఒక రోజు ఎక్కువగా ఉంటుంది. ఇంకోరోజు తగ్గుతుంటుంది. ఆ మధ్య తులం బంగారం లక్ష రూపాయలకు పైగా పెరిగిపోయింది. కానీ ఈ మధ్య మళ్లీ క్రమం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. శుక్రవారం మాత్రం మళ్లీ పెరిగింది. తులం పసిడి ధరపై రూ.600 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి.. రూ.90,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగి.. రూ.99,00 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Exclusive : సెప్టెంబర్ రేస్ లో బాలయ్య, పవన్ లో ఒకరు మాత్రమే
ఇక సిల్వర్ ధరలు కూడా పెరిగాయి. గురువారం ధరలు తగ్గగా.. శుక్రవారం మాత్రం భారీగా పెరిగింది. ఈరోజు రూ.1,000 పెరిగింది. దీంతో శుక్రవారం సిల్వర్ ధర రూ.1,11, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1,20, 100 అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి రూ.1, 11, 000 సేల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Team India ODI Captain: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ ఔట్.. శుభ్‌మన్ గిల్కి బాధ్యతలు..?
