పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. పండగల వేళ బంగారం కొందామనుకుంటున్న గోల్డ్ లవర్స్‌కు ధరలు హడలెత్తిస్తున్నాయి. దసరాకు ముందు ఠారెత్తించిన ధరలు.. దీపావళి నాటికైనా తగ్గుతాయేమోనని భావిస్తున్న వేళ మరోమారు ధరలు దూసుకుపోతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావమో.. లేదంటే అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులో తెలియదు గానీ ధరలు మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. శనివారం తులం గోల్డ్‌పై రూ. 870 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870 పెరిగి రూ.1,19,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి రూ.1,09, 450 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 పెరిగి రూ.89, 550 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగి.. రూ.1,55,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండిపై రూ. 1,65,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ముంబై, బెంగళూరు, ఢిల్లీలో మాత్రం రూ.1,55,000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
