Site icon NTV Telugu

Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold

Gold

మగువలకు గుడ్‌న్యూస్, బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా గోల్డ్, సిల్వర్ ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు కూడా దిగొస్తున్నాయి. ఇవాళ తులం గోల్డ్‌పై రూ.1,370 తగ్గగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.

తులం గోల్డ్‌పై రూ.1,370 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,250 తగ్గడంతో రూ.1,41,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,030 తగ్గడంతో రూ.1,15,650 దగ్గర ట్రేడ్ అవుతోంది.

హమ్మయ్య.. సిల్వర్ ధర కూడా దిగొచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,65, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,75,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,65, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version