కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, నిన్న, ఈరోజు మాత్రం బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 46,200 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.50,400 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.900 పెరిగి 77,500 పలుకుతుంది.