Site icon NTV Telugu

నేడు స్థిరంగా బంగారం ధరలు…

బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదోడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర… ఇవాళ మాత్రం నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు నిలకడగా ఉండగా… వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ. 76,400 వద్ద కొనసాగుతోంది.

Exit mobile version