NTV Telugu Site icon

మ‌గువ‌ల‌కు షాకిచ్చిన పుత్త‌డి…

దేశంలో అత్య‌దికంగా వినియోగించే వాటిల్లో బంగారం కూడా ఒక‌టి.  ధ‌ర‌ల‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు.  ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టిన స‌మ‌యంలో ఈ కొనుగోలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.  నిన్న‌టి వ‌ర‌కు తగ్గుముఖం ప‌ట్టిన బంగారం ధ‌ర‌లు ఈరోజు భారీగా పెరిగాయి.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ. 44,000కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.48,000 కి చేరింది.  ఇక పుత్త‌డితో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి.  కిలో వెండి ధ‌ర రూ.1200 పెరిగి రూ. 74,100కి చేరింది. 

Read:ఫోటో వైరల్: అమెరికాలో ఖుషిఖుషీగా రజనీకాంత్‌