NTV Telugu Site icon

గుడ్‌న్యూస్ః భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు…

బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త.  గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.  బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.  హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.350 తగ్గి రూ.45,740కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది.  చాలా రోజుల త‌రువా 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50 వేల దిగువ‌కు చేరింది.  దేశీయంగా మార్కె్ట్లు తిరిగి క్ర‌మంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గ‌డంతో ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. ఇక బంగారం ధ‌ర‌లు త‌గ్గినప్ప‌టికీ వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు ఉండ‌టం లేదు.  కిలో బంగారం ధ‌ర రూ. 77,300 వ‌ద్ద స్థిరంగా ఉన్న‌ది.