పసిడి ప్రేమికులకు షాకిస్తున్నాయి వరుసగా పెరిగిపోతున్న ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.. ఈ రోజు స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 1.5 శాతం పెరిగి 1,998.37 డాలర్లకు ఎగబాకింది.. ఇక, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం పెరిగి 2,000.20 డాలర్లకు పెరిగింది.. అంతర్జాతీయ పరిస్థిత ప్రభావం దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 1.89 శాతం పెరిగి రూ.53,550 వద్ద ఉంటే, కిలోగ్రాము వెండి ధర 2.35 శాతం పెరిగి రూ.70,785 వద్ద ఉంది. ఒకేరోజులో పసిడి ధర దాదాపు రూ.1500 పెరిగి.. బంగారం కొనాలని చూసేవారిని భయపెడుతోంది.
Read Also: AP Cabinet Meeting: కీలక నిర్ణయాలకు ఆమోదం
ఈ రోజులో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1500కి పెరిగి రూ.53,021కు చేరుకోగా.. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,762కు పెరిగింది.. మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. ఒకేరోజులో వెయ్యికి పైగా పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. వెయ్యి పెరిగి రూ.49,400కి ఎగబాకగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1090 పెరిగి రూ.53,890కి చేరుకుంది. మరోవైపు.. పసిడి బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.2,000కి పెరిగి రూ69,920కి పరుగులు పెట్టింది.
