దేశంలో అధికంగా అమ్ముడుపోయే వాటిల్లో బంగారం కూడా ఒకటి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయాల్సిందే. గత కొంత కాలంగా పుత్తడి ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడ్డారు. అయితే, తాజాగా మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 760 తగ్గి 43,840కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 830 తగ్గి రూ.47,830కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. కిలో వెండి ధర రూ.1500 తగ్గి 70,200కి చేరింది. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశంగా చెప్పుకోవాలి.
Read: భారత సైనికుల చేతికి అత్యాధునిక ఆయుధాలు…