NTV Telugu Site icon

Gold Price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధర

Gold

Gold

మగువలు, పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి.. బుధవారం పైకి కదిలిన పసిడి ధరలు.. ఇవాళ కిందకు దిగివచ్చాయి.. దాదాపు 500 రూపాయల వరకు తగ్గడం విశేషం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 వరకు తగ్గి.. రూ. 50,290కు దిగిరాగా.. ఇదే సమయంలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. ఏకంగా రూ.46,100కు పడిపోయింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి.. కిలో వెండి ధర రూ. 200 తగ్గడంతో రూ. 65,400కు క్షీణించింది. ఇక, రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గుతాయనే అంచనాలు వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.. బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కీలక వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తున్న తరుణంలో బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అంచనా వేస్తున్నారు..

Read Also: Undavalli Arun Kumar: సీఎం జగన్‌కు ఉండవల్లి లేఖ.. విషయం ఇదే..